వేంకటేశ్వరస్వామే నిజాలు బయటపెట్టారు
విజయనగరం: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కూటమి నేతల కల్తీ ఆరోపణలపై ఆ వేంకటేశ్వరస్వామే నిజాలు బయటపెట్టారని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి నేతలు దుష్ప్రచారం చేయడం వారి నీచ రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు. సీబీఐ విచారణలో నెయ్యిలో ఏ విధమైన జంతువుల కొవ్వు కలవలేదని తేలిందని, అప్పట్లో బాధపడిన భక్తులు, ఉద్యోగులకు ఎవరు జవాబు చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, కూటమి నేతలు ఏ ప్రజలనైతే మభ్యపెట్టారో... తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారో వారికి బహింరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి కుట్రలపై కోలగట్ల మండిపడ్డారు. అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు రావడంతో కోట్లాదిమంది భక్తులతో పాటు ప్రసాదం తయారుచేసే సిబ్బంది మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కూటమి నేతల కల్తీ ఆరోపణలు నిజం కాదని సీబీఐ విచారణలో తేలిందన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయలేమన్న భయంతో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిదంటూ ప్రచారం చేసి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుడుగు వేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల నుంచి దూరం చేసేందుకు చంద్రబాబు అండ్ కో ఇటువంటి నీచరాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుని దయవల్ల వాస్తవాలు ప్రజలందరికీ తెలిశాయన్నారు.
● దైవ కార్యక్రమాల్లో కూటమి నిర్లక్ష్యాలు వరుసుగా బయటపడుతున్నాయని కోలగట్ల అన్నారు. ఇటీవల అన్నవరం ప్రసాద విక్రయకేంద్రంలో ఎలుకలు సంచారంతో పాటు, సింహచలంలో గోడకూలి పలువురు మృత్యువాత పడిన సంఘటనలు కూటమి హయాంలో చోటుచేసుకోవడం నిజంకాదా అని ప్రశ్నించారు. తిరుమలలో గతేడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా నెలకొన్న రద్దీలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
● ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని కోలగట్ల ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలుపై తప్పుడు ప్రచారాలు చేసి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల భూములు తీసుకుంటాడని భయపెట్టి ఓట్లు దండుకున్న చంద్రబాబు.. నేడు భూములు రీ సర్వే ఎందుకు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆ యాక్ట్‌ను రద్దు చేశామని ప్రకటించి ఇప్పుడెలా సర్వేపేరిట ప్రజల్లోకి వెళ్తున్నారని ప్రశ్నించారు. మద్యం కల్తీ విషయంలో నిజాలు త్వరలోనే నిగ్గు తేలుతాయన్నారు.
వేలాది కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అమలు కోసం అప్పు చేస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలో చేసిన వేలాది కోట్లు అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలన్నారు. కూటమి చేసిన అప్పులు తీర్చే భారం ప్రజలపై పడుతుందన్న విషయాన్ని మేధావులు, విద్యార్థులు, యువత గమనించాలన్నారు. ఫిబ్రవరిలో జరిగే సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన అప్పులు, కూటమి ప్రభుత్వంలో చేసిన అప్పుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కూటమి చేస్తున్న ఆరాచకాలను అడ్డుకుంటామని, ప్రజా పక్షాన వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
సమావేశంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు కె.త్రినాథ్, జిల్లా ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు డోల మన్మథకుమార్, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, పలువురు కార్పొరేటర్‌లు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
భూములు ధారాదత్తం చేస్తే ఉద్యమిస్తాం
రూ.5వేల కోట్ల విలువచేసే 54 ఏకరాల భూములను విశాఖ ఎంపీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థలకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఆడ్డుకుంటామని కోలగట్ల హెచ్చరించారు. విశాఖలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో భూములు పరిశీలించి నిరసన చేపట్టడం జరి గిందని, ఇప్పటికై నా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు.
జూ ఏమైనా
పవన్ కల్యాణ్
సొంత జాగీరా...?
రాజకీయ దురుద్దేశంతోనే అప్పట్లో టీడీపీ నేతలు కల్తీ లడ్డూ ప్రచారం
సీబీఐ విచారణతో బట్టబయలైన
చంద్రబాబు, కూటమి నేతల కుట్రలు
భక్తులు, సిబ్బంది మనోభావాలకు ఎవరు జవాబు చెబుతారు
తప్పుదోవ పట్టించిన ప్రజలకు
బహిరంగ క్షమాపణ చెప్పాలి
భూములు దారాదత్తం చేస్తే
ఉద్యమిస్తాం
ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారంటూ విశాఖ జూలోకి సందర్శకులను అనుమతించకపోవడం దారుణమన్నారు. అదేమైనా పవన్‌కల్యాణ్ సొంత ఇల్లా అంటూ మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన పర్యటనల్లో బారీకేడ్లు పెట్టుకుంటారు.. పరదాలు కట్టుకుంటారు అంటూ ఆరోపణలు చేసిన నాయకుడు నేడు అరగంట పర్యటన కోసం సొంత జాగీరులా వాడుకోవడం ఎంత వరకు సబబు అని నిలదీశారు.


