భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత | - | Sakshi
Sakshi News home page

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత

Jan 31 2026 6:00 AM | Updated on Jan 31 2026 6:00 AM

భక్తు

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత

కొండడాబాల వ్యాకులమాత యాత్ర రేపు

భారీ బందోబస్తు

దేశంలోనే ఎత్తైన గొర్రెల కాపరి క్రీస్తు స్వరూపం

కొత్తవలస : మండలంలోని కొండడాబాల వ్యాకులమాత పుణ్యక్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన పుణ్యక్షేత్రం ఇది. దీన్ని 1817 సంవత్సరంలో ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ రోమన్‌ కేథలిక్‌ మిషనరీ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఏటా ఫిబ్రవరి నెలలో వచ్చే మొదటి ఆదివారం మహా యాత్రను నిర్వహిస్తుంటారు.

పుణ్యక్షేత్రం చరిత్ర

ఈస్టిండియా కంపెనీ పాలనలో 1876లో సంభవించిన భారీ తుఫాన్‌ వల్ల విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం దగ్గర గల చర్చిలు దెబ్బతిన్నాయి. అక్కడి క్రైస్తవ భక్తులు తమ సొంత గ్రామమైన లక్కవరపుకోట మండలం గనివాడ, నిడిగట్టు గ్రామాలకు చేరుకున్నారు.

1877లో ఫాదర్‌ అలిక్స్‌రీకాగా సాయంతో కొత్తవలస మండలం గొల్లలపాలెం సమీపంలో గల కొండపై పెద్ద కమ్మలశాలను ఏర్పాటు చేసి అప్పట్లో చర్చి నిర్వహించారు.1890లో కొండను చదును చేసి బిషప్‌ జేఎం టిస్సో చేతుల మీదుగా గ్రీకు ప్రాంకోశైలిలో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించి వ్యాకులమాతగా నామకరణం చేశారు. కొండపై పెద్ద డాబాలను నిర్మించారు. నాటి నుంచి కొత్తవలసను కొండడాబాలుగా పిలుస్తున్నారు.

ఫ్రాన్స్‌ నుంచి తెచ్చిన మేరీమాత విగ్రహం ప్రతిష్ట

1914వ సంవత్సరంలో ఫాదర రోస్పియోన్‌ సుమారు రూ.6వేలు వెచ్చించి ఫ్రాన్స్‌ దేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మేరీమాత విగ్రహాన్ని ప్రతి

ష్ఠించారు. తల్లి ఒడిలో బిడ్డ పార్ధీవదేహాన్ని పెట్టుకొని మనోవేదనను తన గుండెల్లో దాచుకున్న వ్యాకులమాత(కనికరమాత)గా ఇక్కడి స్వరూపం ప్రత్యేకత. కొండడాబాల వ్యాకులమాత చర్చిని అన్ని వసతులతో పూర్తి స్థాయిలో నిర్మించి 2020 నాటికి 130 సంవత్సరాలైంది. ఇందుకు గుర్తుగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భారీ గొర్రెలకాపరి క్రీస్తు స్వరూపం ఏర్పాటు చేశారు. క్రీస్తు జీవించిన కాలం ఆధారంగా 331/2 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఇది ఈ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం యాత్ర

ఇక్కడ ఏటా ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం యాత్రను నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల ముందు నుంచి నవదిన పూజా ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఒడిశా, తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

ఆంధ్రాలోనే అతిపెద్ద బోర్డింగ్‌ పాఠశాల

రోమన్‌ కేథలిక్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి 1913వ సంవత్సరంలో తొలిసారిగా బోర్డింగ్‌ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఫాదర్స్‌ శిక్షణ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లు పూర్తి

కొండడాబాలు వ్యాకులమాత యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నాలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు చేపట్టాం.

– డాక్టర్‌ గొండాడ రాజు,

కొండడాబాల విచారణకర్త

భారీ బందోబస్తు

వ్యాకులమాత యాత్ర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 220 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఇక్కడకు వచ్చే వాహనాలు కొత్తవలస జంక్షన్‌ నుంచి రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద నుంచి రాజపాత్రునిపాలెం మీదుగా వెళ్లి తిరుగు ప్రయాణం కొత్తగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మీదుగా నరపాం, తుమ్మికాపల్లి మీదుగా వెళ్లాలి.

– సీహెచ్‌ షణ్ముఖరావు, సీఐ, కొత్తవలస

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత1
1/5

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత2
2/5

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత3
3/5

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత4
4/5

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత5
5/5

భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement