అక్రమ సస్పెన్షన్‌పై ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆందోళన
విజయనగరం అర్బన్/గంటస్తంభం: ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిపై విధించిన అక్రమ సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆ సంఘం జిల్లా రాష్ట్ర కార్యదర్శి వి.రాములు డిమాండ్ చేశారు. స్థానిక ఎల్‌పీజీ భవనంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అక్రమ సస్పెన్ష్‌న్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈ నెల 17న విజయవాడలో మాస్ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించింది. ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను సంఘం పిలుపునిచ్చింది. ఎలాంటి విధులు కేటాయించనప్పటికీ పెట్రోల్ బంకుకు సంబంధించిన అవకతవకల కేసులో అసలు బాధ్యులను వదిలేసి కక్ష సాధింపు ధోరణితో అక్రమంగా సస్పెండ్ చేశారని సంఘం ఆరోపించింది. ఆయన పని చేసే స్థలం వేరైనా డిపోలో విధులు నిర్వహిస్తున్నట్టు కాపీ పేస్టు విధానంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయడం న్యాయ ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది. అక్రమ, చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ఈ సస్పెన్షన్‌ను బేషరతుగా రద్దు చేసే వరకు దశలవారీ ఉద్యమాలు కొనసాగిస్తామని జిల్లా కమిటీ ప్రకటిందించి. కార్యక్రమంలో వివిధ ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు బి.లక్ష్మి, పి.భూషణరావు, ఎ.జగన్‌మోహన్, వి.రాము, సీహెచ్.వెంకటరావు, ఎస్‌కె.రోటి తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 17న విజయవాడలో మాస్ ధర్నా


