సుజుకీ ఈ యాక్సిస్ స్కూటీ ఆవిష్కరణ
విజయనగరం: ద్విచక్ర వాహన రంగంలో వినియోగదారుల అవసరాలగా అనుగుణంగా ముందడుగు వేసే సుజుకీ మోటారు సైకిల్ సరికొత్త ఎలక్రిక్ట్ స్కూటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సుజుకీ ఈ యాక్సిస్ పేరిట మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటీ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది. విజయనగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా గల సుజుకీ షోరూంలో నూతన సుజుకీ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సురేష్‌బాబు, చీఫ్ మేనేజర్ ప్రధాన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో సుజుకీ సంస్థ నూతన సంస్కరణలు వినియోగదారుల మన్ననలు పొందుతాయని ఆకాంక్షించారు. సుజుకీ కంపెనీ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ సురేంద్ర మాట్లాడుతూ సుజుకీ ఈ యాక్సిస్ స్కూటీ వైట్, బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. వాహనాన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, వాహనం కొనుగోలు చేసిన 3 సంవత్సరాల్లో తిరిగి విక్రయించే వారికి బై బ్యాక్ ఆఫర్‌లో 60 శాతం మొత్తం చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా గుంటూరులో ఈ నూతన స్కూటీ అందుబాటులోకి రాగా... విజయనగరంలో మాత్రమే విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సుజుకీ షోరూం ఎండీ అభిరామ్, జనరల్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


