పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌

Feb 5 2026 7:13 AM | Updated on Feb 5 2026 7:13 AM

పాఠశా

పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌

పూసపాటిరేగ: స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి బుధవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠ్యాంశాలను సులభ పద్ధతుల్లో బోధించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధచూపాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం మధ్యాహ్నభోజన పథకం వంటలను పరిశీలించారు. కుమిలి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం–5ను పరిశీలించారు. చిన్నారుల బరువు నమోదు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. అదే గ్రామంలోని సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్‌ను తనిఖీచేశారు. ప్రజలకు అందుతున్న సేవల్లో జాప్యంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తంచేశారు.

పాఠ్యపుస్తక రచనకు

గడిముడిదాం పాఠశాల టీచర్‌

రాజాం సిటీ: టీచర్స్‌ ట్రైనింగ్‌కు రిసోర్స్‌పర్సన్‌గా వ్యవహరించిన రాజాం మండలం గడిముడిదాం ఎంపీపీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయిని వడ్డి ఉషారాణి రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ మండలిలో పాఠ్యపుస్తక రచనకు ఎంపికై ంది. నూతన జాతీయ విద్యావిధానం–2023కు అనుగుణంగా వచ్చే విద్యాసంవత్సరానికి 1 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మారనున్నాయి. ఇందులో భాగంగా పరిసరాల విజ్ఞానం సెమిస్టర్‌–1 పాఠ్యపుస్తకం, వర్క్‌బుక్‌ రచనకు తనను ఎంపిక చేశారని ఆమె బుధవారం తెలిపారు. గతంలో ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ విలువలు పుస్తకరచనలో కూడా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఆమెను ఎంఈఓలు పి.ప్రవీణ్‌కుమార్‌, వై.దుర్గారావు, ఉపాధ్యాయులు అభినందించారు.

స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు త్వరలో నియామకాలు

డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని డీసీసీబీ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం త్వరలో నియామక పక్రియ చేపడతామని ఆ బ్యాంక్‌ చైర్మన్‌ కిమిడి నాగార్జున ప్రకటించారు. తన చాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 మంది సీనియర్లు ఏజీఎం, జీఎం వంటి పోస్టుల్లో నియమితులయ్యారన్నారు. వివిధ బ్రాంచిలలో ఖాళీగా ఉన్న 25 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టామన్నారు.

పంటల నమోదు వేగవంతం చేయాలి

రాజాం సిటీ: రబీ సీజన్లో రైతులు సాగుచేసిన పంటల వివరాల నమోదును వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయశాఖ జేడీ వీటీ రామారావు తమ సిబ్బందిని ఆదేశించారు. అంతకాపల్లి గ్రామంలో బుధవారం చేపట్టిన ఈక్రాప్‌ నమోదును పరిశీలించారు. రైతులంతా ఈ నెల 20లోగా పంటల నమోదుచేయించుకోవాలని సూచించారు. ఈ ఏడాది రైతులే తమ పంటల వివరాలను నమోదుచేసుకునే ఫార్మర్‌ రిజిస్ట్రీ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. పీఎం కిసాన్‌ మిగిలిన విడతల నగదు పడాలంటే రిజిస్ట్రేషన్‌ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రాజాం మండలంలో 88 మంది రైతులు పెండింగ్‌లో ఉన్నారని, వారంతా సంబంధిత వీఏఏల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ కె.చంద్రరావు, ఏఓ సీహెచ్‌.హరనాథ్‌, వీఏఏ లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు.

పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ 1
1/2

పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌

పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ 2
2/2

పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement