మక్కువ మండలంలో ఇద్దరు
మక్కువ: మండలంలోని శంబర గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రూప్–2 ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన ఆర్నిపల్లి సంతోష్‌కుమార్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించడంతో గ్రామానికి చెందిన ఉద్యోగసంఘం సభ్యులు స్వీట్లు తినిపించి, అభినందనలు తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన గంట భానుప్రసాద్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించడంతో, ఆయన తల్లిదండ్రులను గ్రామానికి చెందిన ఉద్యోగసంఘం సభ్యులు దుశ్శాలువాతో సన్మానించారు.
దత్తిరాజేరు మండలంలో ఇద్దరు..
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన సుంకరి సురేష్ గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ)గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సురేష్ తండ్రి అప్పన్న ఇటీవల మృతి చెందిగా తల్లి లక్ష్మితో కలిసి కోమటిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అలాగే ఎస్.చింతలవలస గ్రామానికి చెందిన అల్తివాసు డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వాసును తల్లి రామలమ్మ కష్టపడి చదివించడంతో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. 2019లో కానిస్టేబుల్, 2022లో రైల్వేలో ఉద్యోగాలు సాధించి తొలి ప్రయత్నంలోనే వచ్చిన ఉద్యోగాలను వదులుకుని మరింత పట్టుదలతో చదవడంతో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు.
మక్కువ మండలంలో ఇద్దరు
మక్కువ మండలంలో ఇద్దరు


