యూరియా కోసంరోడ్డెక్కిన రైతులు
ఉన్నతాధికారులు స్పందించాలి
ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసే రైతుకు సకాలంలో యూరియా అందడం లేదు. ఆర్‌ఎస్‌కే మార్పుతో కష్టాలు ఎక్కువయ్యాయి. సమస్యను మండలాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. జిల్లా అధికారులు స్పందించి రైతులకు యూరియా అందేలా చూడాలి.
– బూరి మధుసూదనరావు,
సర్పంచ్, విజయరాంపురం
ప్రైవేటు వర్తకుల దగ్గర కొనుగోలు చేసుకున్నాం
గత ఖరీఫ్ సీజన్ నుంచి ఇంతవరకు గ్రామంలోని ఒక్కో రైతుకు ఒకబస్తా యూరియా మాత్రమే వ్యవసాయ అధికారులు ఇచ్చారు. పంటకు కావాల్సిన యూరియా ప్రైవేటు వర్తకుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసుకొని పంటలకు వేసుకున్నాం. తమ సమస్యను ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోదు. యూరియా కోసం తాము పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
– బూరి చిన్నారావు, రైతు, విజయరాంపురం
ఇదెక్కడి అన్యాయం
యూరియా కోసం విజయరాంపురం గ్రామ రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నాం. అధిక ధరలకు ప్రైవేటు వర్తకుల వద్ద కొనుగోలు చేస్తున్నాం. రైతులకు యూరియా అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలి.
– బూరి వెంకునాయుడు, రైతు, విజయరాంపురం
తెర్లాం:
యూరియా కోసం తెర్లాం మండలంలోని విజయరాంపురం గ్రామ రైతులు రోడ్డెక్కారు. ఖరీఫ్ సీజన్ నుంచి ఇంతవరకు రైతుకు కేవలం ఒకబస్తా యూరియా మాత్రమే వ్యవసాయ అధికారులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. పంటల సాగుకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేని చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోశారు. తెర్లాం వ్యవసాయ కార్యాలయం వద్ద ప్లకార్డులతో శుక్రవారం నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు, రైతులు మాట్లాడుతూ విజయరాంపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని నెమలాం ఆర్‌ఎస్‌కేలో ప్రభుత్వం విలీనం చేసిందన్నారు. విజయరాంపురం గ్రామానికి చెందిన భూములు సుందరాడ, నెమలాం ఆర్‌ఎస్‌కేల పరిధిలో ఉన్నాయని తెలిపారు. అక్కడకు యూరి యా వచ్చినా విజయరాంపురం రైతులకు అందజేయడం లేదని, అక్కడి టీడీపీ నేతలు తమ అనుచరులకు పంపిణీ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఏఓని కలిసి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, మండల సర్వసభ్య సమావేశంలో మండలాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాల వద్ద అధిక ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా అందజేయాలంటూ తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఏడాదిగా రైతుకు ఒక బస్తా యూరియా సరఫరాపై మండిపాటు
తెర్లాంలో విజయరాంపురం రైతుల ధర్నా
ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోసిన రైతులు
యూరియా కోసంరోడ్డెక్కిన రైతులు
యూరియా కోసంరోడ్డెక్కిన రైతులు
యూరియా కోసంరోడ్డెక్కిన రైతులు


