కేన్సర్ పట్ల అవగాహన అవసరం
విజయనగరం ఫోర్ట్: కేన్సర్ పట్ల అవగాహన అవసరమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. ఈ మేరకు వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేన్సర్‌ను త్వరగా గుర్తించగలిగితే నయం చేయవచ్చని తెలిపారు. 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేసుకోవాలని సూచించారు. పురుషులు గొంతుకేన్సర్, నోటి కేన్సర్ రాకుండా ఖైనీ, గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. మహిళలు గర్భాశయ, రొమ్ముకేన్సర్ రాకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ పీఓ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యం, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి


