ఉత్తమ ఫలితాలు సాధించాలి
● డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల రాష్ట్ర అదనపు కార్యదర్శి
వంగర: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల రాష్ట్ర అదనపు కార్యదర్శి సునీల్ రాజ్‌కుమార్ అన్నారు. వంగర మండలం మడ్డువలసలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, సిబ్బంది పనితీరు, డార్మిటరీ, తరగతి గదులు, డైనింగ్‌హాల్ పరిశీలించారు. వంటశాల, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజ నం చేశారు. అనంతరం సిబ్బందితో నిర్వ హించిన సమావేశంలో మాట్లాడారు. విద్యా
ర్థినులు విద్యపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు, చదువులో వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తగిన తర్ఫీదునివ్వాలని సూచించారు. చదువులో రాణిస్తున్నవారిని మరింత ప్రోత్సహించాలన్నారు. సులభ పద్ధతుల్లో బోధన సాగించాలని సూచించారు. బాలికల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జంపా రాధిక, ఉపాధ్యాయినులు, అధ్యాపకులు, గురుకులం సిబ్బంది పాల్గొన్నారు.


