అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Jan 29 2026 6:00 AM | Updated on Jan 29 2026 6:00 AM

అనుమా

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ జగన్నాథ లేఅవుట్‌ లో గల సాయిసంపత్‌ అపార్ట్‌మెంట్‌లో రాజుపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వానపల్లి సోమేశ్వరరావు (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సోమేశ్వర రావు గాజువాక సమీపంలో గల ఒక టైర్ల షాపులో పనిచేస్తూ రోజు ఇంటి నుంచే రాకపోకలు సాగిస్తుంటాడు. మంగళవారం తన తల్లి దగ్గర డబ్బులు తీసుకుని బస్‌ పాస్‌ చేయించుకునేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. కాగా మంగళవారం రాత్రి తన తల్లికి ఫోన్‌ చేసి తన మిత్రుడు కె.ఆశోక్‌కుమార్‌ అపార్ట్‌మెంట్‌లో నిద్రిస్తానని చెప్పి అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయాడు. కాగా ఉదయం మిత్రుడు లేపేందుకు ప్రయత్నించగా కదలిక లేకపోవడంతో చెంతనే గల ఆర్‌ఎంపీ డాక్టర్‌కు చూపించగా అప్పటికే మృతి చెందినట్లు ఆర్‌ఎంపీ ధ్రువీకరించాడు. సోమేశ్వరారావు మృతి అనుమానంగా ఉందని మృతుడి తల్లిదండ్రులు, సోదరులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షన్ముఖరావు తెలిపారు.

గజపతినగరం: మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన మజ్జి పెంటయ్య (75)ఆయాసం, బీపీ, సుగర్‌, కీళ్ల నొప్పులు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర మానసిక ఒత్తడికి గురై 2నెల 26న పురుగు మందు తాగేశాడు. దీంతో పెంటయ్యను కుటుంబసభ్యులు విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. పెంటయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలాగే సాలిపేట గ్రామానికి చెందిన కొడిసి ఆదినారాయణ (46) ఈనెల 26న చింత చెట్టు ఎక్కి చింతబొట్లు రాలుస్తూ ప్రమాదవశాత్తు చెట్టునుంచి కిందకు జారి పడడంతో నడుమ వద్ద తీవ్ర గాయం కాగా కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌ కుమార్‌ నాయుడు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి1
1/2

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి2
2/2

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement