ఫిజియోథెరపిస్ట్‌కు హెచ్చరిక నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిజియోథెరపిస్ట్‌కు హెచ్చరిక నోటీస్‌

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

ఫిజియోథెరపిస్ట్‌కు హెచ్చరిక నోటీస్‌

ఫిజియోథెరపిస్ట్‌కు హెచ్చరిక నోటీస్‌

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చిన రోగులను ఓ ఫిజియో థెరపిస్టు క్లినిక్‌కు తరలిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీని నియమించారు. జనరల్‌ సర్జరీ హెచ్‌ఓడీ పి.ఏ.రమణి. రేడియాలజీ ప్రొఫెసర్‌ శివశ్రీధర్‌, సీఎస్‌ ఆర్‌ఎంఓ ఆనంద్‌కుమార్‌ ఫిజియో థెరపిస్ట్‌ దీపక్‌ వర్దన్‌పై విచారణ జరిపారు. విచారణలో క్లినిక్‌కు తరలించడం వాస్తవమేని రోగి ఒకరు విచారణ కమిటీ అధికారులకు చెప్పడంతో దీపక్‌వర్దన్‌కు హెచ్చరిక నోటీసుల జారీచేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజ తెలిపారు. కపై ఇటువంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఉపాధ్యాయ, ఉద్యోగ

సమస్యలు పరిష్కరించండి

విజయనగరం అర్బన్‌: రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీజీఈఏ జిల్లా కమిటీ సభ్యులు జిల్లాలోని ప్రజాప్రతినిధులందరికీ వినతి పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్‌ గాదె శ్రీనివాసులునాయుడును విజయనగరంలో కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్సీ స్పందిస్తూ ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి ఆర్థిక సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీని కలిసిన సంఘనాయకుల్లో జిల్లా అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శులు బాలభాస్కర్‌, లెంక సత్తిబాబు, విజయనగరం పట్టణ అధ్యక్షులు సీహెచ్‌ వెంకటసతీష్‌, పి.చంద్రశేఖర్‌, మహిళా విభాగం అధ్యక్షులు వి.రాశేశ్వరి తదితరులు ఉన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పి.అదితిగజపతిరాజుకు కూడా వినతి పత్రాన్ని అందజేశారు.

47 మంది హెల్త్‌ అసిస్టెంట్లకు రీ పోస్టింగ్‌

విజయనగరం ఫోర్ట్‌: వైద్య,ఆరోగ్య శాఖకు చెందిన 47 మంది హెల్త్‌ అసిస్టెంట్లను 14 నెలలుగా విధులు నుంచి తొలగించారు. వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విధుల నుంచి తొలగించడం సరికాదని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్త్‌ అసిస్టెంట్స్‌కు మంగళవారం రీ పోస్టింగ్‌ ఆర్డర్స్‌ను డీఎంహెచ్‌ఓ ఎస్‌.జీవనరాణి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement