బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ | - | Sakshi
Sakshi News home page

బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

బొద్ద

బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ

వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో సోమవారం పట్టపగలు జనపరెడ్డి వెంకటరమణ ఇంటిలో జరిగిన దొంగతనం కేసుపై ఇన్‌చార్జి డీఎస్పీ ఆర్‌.గోవిందరావు గ్రామంలో విచారణ చేశారు. చోరీ విషయంపై పలువురు స్థానికులను ఆరా తీశారు. డీఎస్పీతో పాటు ఎస్‌.కోట రూరల్‌ సీఐ ఎల్‌.అప్పలనాయుడు, ఎస్‌.కోట ఎస్సై నారాయణ మూర్తి బొద్దాంలో చోరీకి గురైన గృహాన్ని, పరిసరాలు పరిశీలించి దర్యాప్తు నిర్వహించారు.

20 లీటర్ల సారాతో

నిందితుడి అరెస్టు

కురుపాం: మండలంలోని పూతికవలస గ్రామ పరిసరాల్లో ద్విచక్రవాహనంపై 20 లీటర్ల సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బొత్స ప్రవీణ్‌ ద్విచక్రవాహనంపై సారా తరలిస్తుండగా పూతికవలస వద్ద దాడులు నిర్వహించి సారాను సీజ్‌చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం, సారా తరలించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

838 లీటర్ల సారా ధ్వంసం

జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 21 కేసుల్లో పట్టుబడిన 838 లీటర్ల సారాను ధ్వంసం చేశామని చినమేరంగి ఎస్సై పి.అనీష్‌ తెలిపారు. అలాగే నాలుగు కేసుల్లో పట్టుబడిన 85 మద్యం సీసాలను కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ సమక్షంలో దాడులు నిర్వహించామన్నారు.

4.45క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

బొబ్బిలి రూరల్‌: మండలంలోని పారాదిలో పసుమర్తి నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పౌరసరఫరాల ఉప తహసీల్దార్‌ రెడ్డి సాయికృష్ణ తెలిపారు. మంగళవారం ఉదయం అక్రమ బియ్యం వ్యవహారానికి సంబంధించిన సీఎస్‌డీటీకి సమాచారం రాగానే సిబ్బందితో కలిసి వెళ్లి ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన బియ్యాన్ని మరో డీలర్‌కు అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఎస్‌డీటీ చెప్పారు.

కోడి పందాలపై పోలీసుల దాడి

లక్కవరపుకోట: మండలంలోని దాసుళ్లపాలెం గ్రామం సమీప తోటల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై ఎస్సై నవీన్‌పడాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందాలు ఆడుతున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12,600 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం

చైర్మన్‌గా తాడ్డి గోవింద్‌

విజయనగరం అర్బన్‌: ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీ 2026–29 పదవీకాలానికి సంబంధించిన ఎన్నికలు మంగళవారం స్థానిక రెవెన్యూ హోమ్‌లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా చైర్మన్‌గా తాడ్డి గోవింద, అసోసియేట్‌ చైర్మన్‌గా ఎస్‌.రామకృష్ణ, వైస్‌చైర్మన్‌–1గా బాల మహేశ్‌, వైస్‌ చైర్మన్‌–2గా ఎ.అప్పలనాయుడు, వైస్‌చైర్మన్‌–3గా పి.చంద్రశేఖర్‌రాజు, వైస్‌చైర్మన్‌ 4 గా డాక్టర్‌ డి.సురేష్‌, ప్రధాన కార్యదర్శిగా పి.భానుమూర్తి, సెక్రటరీ–1గా కె.సురేష్‌, సెక్రటరీ–2గా వి.సత్యనారాయణ, సెక్రటరీ–3గా వై.గోవిందరావు, సెక్రటరీ–4గా ఎం.నాగేశ్‌ కుమార్‌, కోశాధికారిగా సీహెచ్‌వీ అప్పారావు ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు.

బొద్దాం చోరీ కేసుపై  డీఎస్పీ విచారణ1
1/3

బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ

బొద్దాం చోరీ కేసుపై  డీఎస్పీ విచారణ2
2/3

బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ

బొద్దాం చోరీ కేసుపై  డీఎస్పీ విచారణ3
3/3

బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement