మా భూములు లాక్కోవద్దు ‘బాబూ’
అభివృద్ధి పేరుతో సాగుభూములను లాక్కోవడం ప్రభుత్వానికి తగదని, జీవనాధారాన్ని దూరం చేయొద్దంటూ భోగాపురం మండలం ముంజేరు గ్రామ రైతులు విజ్ఞప్తిచేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతులు అందజేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినతుల సామూహిక నమోదు వీలుకాదని సిబ్బంది అడ్డుకోవడంతో, వారంతా వ్యక్తిగతంగా ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే సాంకేతిక సమస్య అంటూ ఫిర్యాదుల నమోదును వాయిదా వేశారు. దీనిపై అసహనం వ్యక్తంచేస్తూ మహిళలు, రైతులు కలెక్టరేట్ పోర్టుకో ఎదుట ఆందోళన చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి మా పరిసరస ప్రాంతాల రైతులు చాలావరకు భూములు కోల్పోయి జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు తమకు అదే పరిస్థితి తేవద్దంటూ నినదించారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టంచేశారు.
– విజయనగరం అర్బన్


