జిల్లాలో మీడియా అక్రిడిటేషన్ కార్డులకు ఆమోదం
విజయనగరం అర్బన్: జిల్లాలోని పెద్ద, చిన్న, దిన, మాస పత్రికలు, శాటిలైట్ టీవీ ఛానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియాకు చెందిన మొత్తం 407 మందికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయించింది. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి కన్వీనర్‌గా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు వ్యవహరించారు. కమిటీ సభ్యులు సమావేశంలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఎక్స్ ఆఫీసియో సభ్యులు, సీపీఓ పి.బాలాజీ, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు, పీఎస్‌ఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, టి.రాధాకృష్ణ, కె.రమేష్‌నాయుడు, మహాపాత్రో వెంకటేశ్వర, బీజీఆర్ పాత్రో, ఎం.శివకుమార్, పంచాది అప్పారావు, బూరాడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెప్రసీ అండ్ టీబీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ కె.రాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీపీఈఓ జె.శ్రీనివాసరావు, కార్మిక శాఖ ఏసీ జి.ఎల్లాజీరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్.జానకమ్మ, సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజినీర్ పి.మల్లేశ్వరరావు, ఏపీఆర్‌ఓ సీహెచ్ ప్రభుదాస్ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సత్కరించారు.


