రాములోరికిపుష్పార్చన సేవ | - | Sakshi
Sakshi News home page

రాములోరికిపుష్పార్చన సేవ

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

రాములోరికిపుష్పార్చన సేవ

రాములోరికిపుష్పార్చన సేవ

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సోమవారం పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. సీతారాములను స్వర్ణాభరణాలతో అలంకరించి ద్వాదశ ఆరాధన, సప్తావరణ సేవ జరిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

పని ఒత్తిడి తగ్గించాలి

విజయనగరం అర్బన్‌: ఆర్టీసీ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని, అవకతవకలతో ఉద్యోన్నతలు కల్పించే ప్రక్రియను ఆపకపోతే ఉద్యమం తప్పదని ఆర్టీసీ గ్యారేజ్‌ ఉద్యోగులు, వర్క్‌షాప్‌ సిబ్బంది హెచ్చరించారు. జాల్లా పరిషత్‌ మినిస్టీరియల్‌ సిబ్బంది సమావేశ మందిరంలో సోమవారం జరిగిన జోన్‌–1 గ్యారేజీ ఉద్యోగుల, వర్క్‌షాప్‌ సిబ్బంది సమావేశంలో పలువురు మాట్లాడారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఉద్యోగోన్నతులు కల్పించడం యాజమాన్య కుతంత్రమేనని వ్యాఖ్యానించారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్‌ఎంయూ జోనల్‌ కార్యదర్శి బీఎస్‌రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్‌, అధ్యక్షుడు దుర్గారాజు, డీపో కార్యదర్శి చంద్రమౌళి, గ్యారేజ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement