ఉత్తరాంధ్ర నృత్య పోటీలకు ఆహ్వానం
రాజాం సిటీ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరను పురష్కరించుకుని సలాది వెంకటరమణ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయి సాంప్రదాయ నృత్య పోటీలు నిర్వహించనున్నామని కళాపరిషత్ అధ్యక్షులు సలాది తులసీదాస్ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 22 నుంచి జరగనున్న జాతరను పురష్కరించుకుని 22 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నామ న్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ పోటీలకు సంబంధించి ఫిబ్రవరి 10లోగా ఎంట్రీలు పంపించాలని అన్నారు. ఆర్నెపల్లి వెంకటనాయుడు, కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి, అమ్మవారికాలనీ, రాజాం పేరిట ఎంట్రీలు పంపించాలని కోరారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నామని తెలిపారు. వివరాలకు 6303215996 నంబరును సంప్రదించాలని సూచించారు. సమావేశంలో మక్క అప్పలనాయుడు, బీవీ అచ్యుత్‌కుమార్, గట్టి పాపారావు, పెంకి గౌరీశ్వరరావు, ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


