డ్రైవర్లకు కంటిచూపు పరీక్షలు తప్పనిసరి
● ఉపరవాణా కమిషనర్ డి.మణికుమార్
విజయనగరం టౌన్: వాహనాలు నడిపే డ్రైవర్లందరూ తప్పనిసరిగా కంటిచూపు పరీక్షలు చేయించుకోవాలని ఉపరవాణా కమిషనర్ డి.మణికుమార్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో డ్రైవర్లకు ఆరోగ్య, కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్లు యు.దుర్గాప్రసాద్, ఎం.శశికుమార్, శ్రావ్య, రమేష్‌కుమార్, నవీన్ కుమార్, ఐశ్వర్య, ప్రభుత్వాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
అభా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
● అదనపు డీఎంఈ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్వరావు
విజయనగరం ఫోర్ట్: అభాయాప్‌లో రోగుల వివరాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరని అదనపు డీఎంఈ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్వరావు అన్నారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని లెక్చర్ గ్యాలరీలో వైద్యులకు, సిబ్బందికి గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభాయాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల రోగ నిర్ధారణ, ప్రయోగశాల పరీక్షలు, డిశార్జ్ సంబంధిత సమాచారం పొందడానికి సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐసీ డైరెక్టర్ కె.శ్యామలరావు, నోడల్ అధికారి అనూరాధ, సూపరింటెండెంట్ అల్లు పద్మజ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సరోజనీదేవి, డిప్యూటీ సూపరింటెండెంట్ పి.ఎ.రమణి, సీఎస్‌ఆర్‌ఎంఓ ఎల్. ఆనంద్‌కుమార్, ఆర్‌ఎంఓ కామేశ్వరావు, ఎ.డి. పీఎన్ అప్పారావు, ఏఓ ఎర్రాజీరావు తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్ స్పాట్స్ వాహనాలు ప్రారంభం
30 మందికి మెరిట్ స్కాలర్ షిప్‌లు
విజయనగరం అర్బన్: గాజులరేగ పరిధిలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో చదువులో ప్రతిభ చూపుతున్న 30 మంది విద్యార్థులకు బొత్స గురునాయుడు మరియు మజ్జి రామారావు మెమోరియల్ మెరిట్ స్కాలర్‌షిప్ కింద రూ.5లక్షల నగదు, మెడల్, ప్రశంసా పత్రాలను మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే మెరిట్ స్కాలర్‌షిప్‌ల ప్రధాన లక్ష్యమన్నారు. విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. మామయ్య, తండ్రి జ్జాపకార్థం కళాశాల స్థాపించిన నాటి నుంచి ప్రతిభావంత విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్‌లు అందజేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, బొత్స చైతన్యబాబు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డ్రైవర్లకు కంటిచూపు పరీక్షలు తప్పనిసరి
డ్రైవర్లకు కంటిచూపు పరీక్షలు తప్పనిసరి


