50 పాఠశాలల బస్సుల తనిఖీ పూర్తి | - | Sakshi
Sakshi News home page

50 పాఠశాలల బస్సుల తనిఖీ పూర్తి

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని 95 పాఠశాలల బస్సుల్లో ఫిట్‌నెస్‌, బస్సుల రికార్డులను ఇప్పటివరకు 50 బస్సులకు జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం తనిఖీ చేశారు. బస్సుల పనితీరు, సాంకేతిక పరిస్థితులు పరిశీలించి, మిగిలిన 45 బస్సులను కూడా త్వరలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బస్సులు సురక్షితంగా నడవడం లక్ష్యమని డీటీఓ తెలిపారు. బస్సులను తనిఖీ చేయించుకోకపోతే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement