● శ్రద్ధగా నీతికథల బోధన
శృంగవరపుకోట పట్టణంలోని శాఖాగ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వర్ధమాన కవయిత్రి కటకం పావని విద్యార్థినీ విద్యార్థులతో గురువారం నీతి కథలు చదివించారు. కథల్లోని నీతిని విద్యార్థులకు వివరించారు. అనంతరం చిన్నారులకు వివిధ ఆటల్లో తర్ఫీదునిచ్చారు. – ఎస్.కోట
క్రికెట్ ఆడుతున్న చిన్నారులు
వేసవి సెలవుల్లో పిల్లలు సరదాసరదాగా గడుపుతున్నారు. నచ్చిన ఆటల్లో శిక్షణ పొందుతున్నారు. పల్లెల్లో గ్రామీణ క్రీడల్లో మునిగితేలుతున్నారు. ఏ వీధిన చూసినా చిన్నారులు సందడే కనిపిప్తోంది. క్రికెట్, గోలీపిక్కలు, క్యారెమ్స్, చెస్ తదితర ఆటల్లో నిమగ్నమవుతున్నారు. రామభద్రపురంలో పలువురు విద్యార్థులు చెస్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. తోటి చిన్నారులతో కలిసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మెదడుకు పదును పెడుతున్నారు. ఆటలో రాటుదేరుతున్నారు. వేసవిలో పిల్లలను ఆటల్లో ప్రోత్సహించాలని, ప్రమాదకర ఆటలవైపు వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని విద్యావేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి భోజనం చేసేలా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండేలా చూడాలని సూచనలు ఇస్తున్నారు.
– రామభద్రపురం


