పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలి

May 17 2026 12:36 AM | Updated on May 17 2026 12:36 AM

–8లో

–8లో

శాసన మండలి విపక్ష నేత

బొత్స సత్యనారాయణ

Ð]l$íßæ-âýæ-ÌS…sôæ G…§ýl$-MýS…™èl ^èl$ÌSMýS¯]l..!˘

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలను చులకనగా చూడడం తగ దని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రావణి మండిపడ్డారు.

చీపురుపల్లి రూరల్‌(గరివిడి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. గరివిడిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల నాయకులతో ఆయన శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఐక్యతగా పని చేయాలన్నారు. గ్రామ, వార్డు, బూత్‌ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని నాయకులకు సూచించారు. ప్రతీ కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలపై వెంటనే స్పందిస్తూ పార్టీపై నమ్మకాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నాయకులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీకి మరింత బలమైన పునాది వేసే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, బొత్స సందీప్‌, బొత్స అనూష, మూడు మండలాల పార్టీ నాయకులు ఎస్‌వి.రమణరాజు, మీసాల వరహాలనాయుడు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, తాడ్డి వేణు, బూర్లె నరేష్‌, పలు పంచాయతీల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement