కాలువ ఇలా.. సాగునీరు వెళ్లేదెలా? | - | Sakshi
Sakshi News home page

కాలువ ఇలా.. సాగునీరు వెళ్లేదెలా?

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

చిత్రంలో కనిపిస్తున్నది రాజాం మండలంలోని వీఆర్‌ అగ్రహారం, పొగిరి గ్రామాల మధ్య ఉన్న తోటపల్లి పిల్లకాలువ. కాలువ నిండా పిచ్చిమొక్కలు పెరగడం, పూడికపోవడంతో రైతులకు ఖరీఫ్‌లో సాగునీరు అందడం లేదు. గతంలో వేసవిలో ఉపాధిహామీ నిధులతో కాలువను బాగుచేసేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు పనులు చేయలేదు. ఖరీఫ్‌ సమీపిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కాలువ ఇలా ఉంటే సాగునీరు అందే పరిస్థితి ఉండదని ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాలువలో పూడికలు తొలగించాలని, మరమ్మతులకు గురైన స్లూయీస్‌లు బాగుచేయాలని కోరుతున్నారు. – రాజాం

Advertisement
 
Advertisement
Advertisement