కొమరాడ మండలం
● 2024 సెప్టెంబర్ 17న కొమరాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదివిన కె.శారద అనారోగ్యంతో మృతి చెందింది.
కురుపాం మండలం
● 2024 నవంబర్ 6వ తేదీన కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలురు)లో నాల్గో తరగతి చదువుతున్న నిమ్మక నితిన్(9) అనారోగ్యం బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
● 2025 సెప్టెంబర్ 26వ తేదీన కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి పచ్చకామెర్లతో బాధపడుతూ మృతిచెందింది.
● 2025 సెప్టెంబర్ 30న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన పచ్చకామెర్లతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్‌లో మృతిచెందింది.
జియ్యమ్మవలస మండలం
● 2024 నవంబర్ 6న రావాడ రామభద్రపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలో 7వ తరగతి చదివిన నిమ్మక జీవన్ కుమార్(12) అనారోగ్యంతో మృతిచెందాడు.
● నెల రోజుల వ్యవధిలో ఇదే ఆశ్రమ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి బి.ఈశ్వరరావు కూడా అనారోగ్యంతో మతిచెందాడు.
గుమ్మలక్ష్మీపురం: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో పలువురు అనారోగ్యం కారణంగా మృతి చెందుతుండడం దురదృష్టకరం. కొంతమంది విద్యార్థులు పాఠశాలలు నడుస్తున్న వేళల్లో అనారోగ్యం బారిన పడి మృతిచెందగా.. మరికొంత మంది విద్యార్థులు వేసవి సెలవులకు ఇంటికి వెళ్లినప్పటికీ అనారోగ్యం బారిన పడి మృతిచెందుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు కానరావడం లేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులవుతారని ఆశించిన తల్లిదండ్రుల కలలు కలగానే మిగిలిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం హయాంలో కురుపాం నియోజకవర్గంలోని విద్యాలయాల్లో చదువుతూ మృతి చెందిన విద్యార్థుల వివరాలు
వేసవి సెలవుల్లోనూ..
నలుగురు విద్యార్థుల మృతి
ఈ ఏడాది వేసవి సెలవులు ఇచ్చిన 23 రోజుల్లోనే గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలకు చెందిన నలుగురు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు మృతిచెందారు. ఈమేరకు కురుపాం మండలం నీలకంఠాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన బిడ్డిక రాహుల్, దుడ్డుఖల్లు ఆశ్రమ పాఠశాలకు చెందిన జి.అఖిల్, దొరజమ్ము ఆశ్రమ పాఠశాలకు చెందిన నిమ్మక అసిరయ్యలతో పాటు గుమ్మలక్ష్మీపురం కేజీబీవీకి చెందిన పత్తిక సుస్మిత ఆయా అనారోగ్య కారణాలతో మృతిచెందారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
గిరిజన విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు కానరాకపోవడం పట్ల గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచైనా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
23 రోజుల్లోనే నలుగురి మృతి
గుమ్మలక్ష్మీపురం మండలం
2024 జూలై 21వ తేదీన వామాసీ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి మండంగి గౌతమ్ (9) మలేరియాతో బాధపడుతూ మృతిచెందాడు.
2024 అక్టోబర్ 2వ తేదీన పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మల అవంతి(13) రక్తహీనత, తీవ్ర జ్వరంతో బాధపడుతూ పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
2024 డిసెంబర్ 17వ తేదీన దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పత్తిక దినేష్(14) పచ్చకామెర్లు, రక్తహీనత, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మృతిచెందాడు.
2025 డిసెంబర్ 14న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో టెన్త్ చదువుతున్న టి.అవిష్ అనారోగ్యంతో మృతిచెందాడు.
2026 జనవరి 7వ తేదీన రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మక రూప బ్రీతింగ్ ప్లోబ్లంతో పాటు బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది.


