రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

గజపతినగరం రూరల్‌: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఈశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు... పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) ఈ నెల ఆరో తేదీ రాత్రి 8.40 గంటల సమయంలో రైల్వే టికెట్‌ తీసుకొని భవానిపట్నం పాసింజర్‌లో సింహాచలం నుంచి పార్వతీపురం ప్రయాణం చేస్తుండగా గజపతినగరం – కోమటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బొబ్బిలి జీఆర్‌పీ హెచ్‌సీ బండారు ఈశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement