టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

శాసన మండలి విపక్ష నాయకుడు

బొత్స సత్యనారాయణ

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ నాయకులకు శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. గరివిడిలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శనివారం మాట్లాడారు. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై ఆరా తీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దామన్నారు. ముందుగా చీపరుపల్లి మండల నాయకులతో బొత్స కుమార్తె అనూష సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎలకల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement