పిల్లలపై ఓ కన్నేయండి..! | - | Sakshi
Sakshi News home page

పిల్లలపై ఓ కన్నేయండి..!

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

విజయనగరం గంటస్తంభం: వేసవి సెలవులొచ్చాయంటే పిల్లలకి పండగే. పుస్తకాల భారముండదు.. ఉదయం లేచిందే మొదలు ఆటలు.. మధ్యాహ్నం మొబైల్‌.. సాయంత్రం స్నేహితుల వెంట ఊరు చుట్టేయడం. కానీ అదే ఆనందం కొన్ని కుటుంబాల్లో కన్నీళ్లు మిగులుస్తోందని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెలవులు మొదలైనప్పటి నుంచి పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మొబైల్‌ మోజు... మెల్లగా మింగేస్తోంది

డిజిటల్‌ కాలంలో చిన్నారులు మొబైల్‌ ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఉదయం లేవగానే ఫోన్‌.. రాత్రి పడుకునే వరకు గేమ్స్‌, రీల్స్‌, సోషల్‌ మీడియాతో గడుపుతున్నారు. బయట ఆటలు తగ్గిపోవడంతో పాటు చదువుపై ఆసక్తి కూడా తగ్గుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొంత మంది పిల్లలు అనవసర యాప్‌లు, చెడు స్నేహాల ప్రభావానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

చెడు సావాసాలు జీవితాలను నాశనం

చేసేస్తున్నాయి..

సెలవుల సమయంలో పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు మైనర్లు గంజాయి, సిగరెట్‌, ఇతర మత్తు పదార్ధాల వైపు ఆకర్షితులవుతున్నారని సమాచారం. సరదాగా మొదలైన అలవాటు తర్వాత కుటుంబాలకు తీరని బాధను మిగులుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి

పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు...? ఎవరితో తిరుగుతున్నారు..? ఏమి చూసున్నారు..? అన్నది తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. భయపెట్టకుండా ప్రేమగా మాట్లాడితే పిల్లలు తమ విషయాలు చెప్పుకుంటారని చెబుతున్నారు. సెలవుల సమయంలో పిల్లల కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. స్నేహితుల్లా మాట్లాడితేనే వారు సరైన మార్గంలో నడుస్తారు. పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

– వై.సతీష్‌కుమార్‌, కెమిస్ట్రీ లెక్చరర్‌,

మానసిక వికాస నిపుణులు, విజయనగరం

తల్లిదండ్రులూ..

బిడ్డలూ పదిలం.. సుమీ!

మృత్యువుతో చెలగాటమొద్దు

ఆటల మాటున ఆపదలు

ఆన్లైన్‌లో మునిగితే భవిష్యత్తుకే ముప్పు

చెరువులు, రోడ్లు, మొబైళ్లతో

పెరుగుతున్న ప్రమాదాలు

సరదా.. వ్యవనం కాకముందే మేల్కొనండి

మత్తు పదార్ధాలు, డిజటల్‌ బానిసత్వంపై నిఘా ఉంచండి

తల్లిదండ్రులు అప్రమత్తంగా

ఉండాలని నిపుణుల హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement