న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలి

May 17 2026 12:36 AM | Updated on May 17 2026 12:36 AM

బైరెడ్డిపాలెంలో ఎయిర్‌పోర్టు అప్రోచ్‌ రోడ్డు పేరిట నిరుపేదల భూములు కాజేయాలని చూస్తున్నారు. పరిహారం తీసుకోకుండానే బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు నిరుపేద రైతులకు న్యాయం చేసిన తరువాత భూసేకరణ చేయాలి. బలవంతంగా యంత్రాలతో పక్కకు నెట్టి పనులు చేయడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ అధికారులు ఆలోచన చేయాలి.

– బైరెడ్డి అప్పలనర్సయ్య, బైరెడ్డిపాలెం

అప్రోచ్‌ రోడ్‌ ప్రతిపాదనలు మార్చాలి

బైరెడ్డిపాలెం సమీపంలో ఎయిర్‌పోర్టు అప్రోచ్‌ రహ దారి నిర్మాణం ప్రణాళికబద్దంగా లేదు. నిరుపేద రైతులను లక్ష్యంగా చేసుకొని రహదారి ప్రతిపాదనలు చేశారు. బడాబాబుల భూములను ఉద్దేశపూర్వకంగా తప్పించి నిరుపేదల భూములు వైపు రహదారి నిర్మాణం మార్చారు. తక్షణమే అధికారులు పునరాలోచన చేయాలి. – బైరెడ్డి దుర్గమ్మ, బైరెడ్డిపాలెం

అధికారులు పునరాలోచన చేయాలి

బైరెడ్డిపాలెంలో ఎయిర్‌పోర్టు రహదారి నిర్మాణంపై ఆలోచన చేయాలి. కేవలం నిరుపేద రైతుల భూములలో రహదారి వేసే విధంగా ప్రతిపాదనలు చేశారు. బడాబాబుల భూములను వదిలేసి నిరుపేదలపై కక్ష కట్టారు. అధికారులు పునరాలోచన చేయాలి.

– కొత్త పాపమ్మ, బైరెడ్డిపాలెం

Advertisement
 
Advertisement
Advertisement