ఇంధన ధరల పెంపుపై నిరసన | - | Sakshi
Sakshi News home page

ఇంధన ధరల పెంపుపై నిరసన

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయనగరం మండలం, వీటీ అగ్రహారం గ్రామ సచివాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ఆదివారం నిరసన చేపట్టారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఇంధన ధరలు పెంచబోమని చెప్పి, ఇప్పుడు ఆ ఎన్నికలు ముగియగానే అమాంతం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహనరావు మండిపడ్డారు. ఇంధన ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని ఇది అటు వాహనదారులకు ఇటు సామాన్య ప్రజలకు ఇబ్బందేనన్నారు. తక్షణమే పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే 12వ పీఆర్సీ ప్రకటించి, మున్సిపల్‌ కార్మికుల వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

– విజయనగరం గంటస్తంభం

Advertisement
 
Advertisement
Advertisement