విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026 తూతూ మంత్రంగా.. కిశోరీ వికాసం! పైనాపిల్‌ సీజన్‌ ఆరంభం

కార్యక్రమాలు ఇలా...

న్యూస్‌రీల్‌

నిర్వహణకు నిధులు విదల్చని సర్కారు చేతి చమురు వదిలించుకుంటున్న అంగన్‌వాడీ నిర్వాహకులు శిబిరాలు ఒక్క పూటకే పరిమితం కొరవడిన పర్యవేక్షణ నెరవేరని ఆశయం

చిత్తశుద్ధితో నిర్వహించాలి..

సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026
తూతూ మంత్రంగా.. కిశోరీ వికాసం!

గిరిజన రైతులకు ప్రధాన జీవనాధారమైన పైనాపిల్‌ సీజన్‌ ఆరంభమైంది. సీతంపేట మన్యంలో అత్యధికంగా ఈ నెల నుంచి ఆగస్టు వరకు దిగుబడి అవుతుంది. 8లో

రామభద్రపురం:

కిశోరీ బాలికల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోరీ వికా సం కార్యక్రమం తూతూ మంత్రంగా సాగుతుంద న్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాల్య దశలోనే లైంగిక వేధింపులు, పదో తరగతి పూర్తికాక ముందే మూడు ముళ్లు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు అనేక రకాల వేధింపుల వంటి చర్యలతో ఏం చేయా లో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. వారిలో చైతన్యం తెచ్చేందుకు కిశోరీ వికాసం వేసవి శిబిరాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కార్యక్రమం నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం పైసా నిధులు విదల్చని పరి స్థితి ఉంది. నిధులు కొరతతో మంచి ఆశయంతో కౌమార దశలో ఉన్న బాలబాలికల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిశోరీ వికాసం కార్యక్రమం గాడి తప్పుతోంది. అంగన్‌వాడీ టీచర్లు వారి సొంత డబ్బులు వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా.. ఫొటోలకు పోజిలిస్తూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో ఈ నెల 1 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు 11 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలికలు, 15 నుంచి 18 సంవత్సరాలలోపు బాలురకు గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్‌ క్యాలెండర్‌ ప్రకారం శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. బాలికలకు ఉదయం, బాలురకు మధ్యాహ్నం ఈ శిబిరాలు నిర్వహించాలి. ఇందులో విద్య, ఆరోగ్యం, సచివాలయం, మెప్మా, అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా, ఆర్పీలు భాగస్వామ్యం కావాల్సి ఉంది. అయితే ఐసీడీఎస్‌ అధికారులు బాల, బాలికలకు కలిపి ఉదయం పూటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఎగ్గొట్టేస్తున్నారని తెలిసింది. ఈ కార్యక్రమంలో కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది కూడా గైర్హాజరవుతున్నార న్న విమర్శలు లేకపోలేదు.

పర్యవేక్షణ లోపం

అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో శిబిరాల నిర్వహణపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు కనీస అవగాహన లేకుండా పొవడంతో పాటు కిశోరీ వికా సం వేసవి శిబిరాల ఆశయం నేరవేరడం లేదు.

బాల బాలికలను బృందాలుగా విభజించి అందులో సభ్యులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవడం.

స్వీయ అవగాహన ద్వారా తనను తాను తెలుసుకోవడం, ఆత్మ విశ్వాసం పెంచేలా చేయడం.

ఆరోగ్య మేళా, రక్తహీనత, కిశోరీ బాలికల ఆరోగ్య సమస్యల నివారణపై అవగాహన కల్పించడం.

సమాజంలో పిల్లలు ఎదుర్కొనే వ్యక్తిగత, సమూహ అవసరాలు, సవాళ్లను అధిగమించడం, ధైర్య సాహసాలు పెంపొందించడం.

దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు.

పోక్సో చట్టం, పీసీఎంఏ చట్టం, డీవీ, ఆర్‌టీఈ చట్టాలపై అవగాహన.

పొదుపు అలవాట్లు, క్రీడలు, యోగా ప్రాముఖ్యం. సైబర్‌ భద్రత, ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన, మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలు వివరించడం.

బాల్య వివాహాల నిరోధం, బాలికల భద్రత, విద్య ప్రోత్సాహం తదితర అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంది.

ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వం ఆదేశించిన అన్ని శాఖల సిబ్బంది అందరూ కలిసి చిత్తశుద్ధితో కిశోరీ వికాసం కార్యక్రమం నిర్వహించాలి. కార్యక్ర మం నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. కిశోరీ వికాసం కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు.

– బాలామణి, ఐసీడీఎస్‌ పీడీ, విజయనగరం

Advertisement
 
Advertisement
Advertisement