గురుకుల ప్రవేశ పరీక్షలో కిర్ల విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

గురుకుల ప్రవేశ పరీక్షలో కిర్ల విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంకు

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

● ఏపీ రెసిడెన్షియల్‌

పరీక్షలో ఫస్ట్‌ర్యాంకు సాధించిన ఆకాష్‌రెడ్డి

జామి: విజయనగరం జిల్లా జామి మండలంలోని కిర్ల గ్రామానికి చెందిన ఆకాష్‌రెడ్డి అనే విద్యార్థి ఏపీ రెసిడెన్షియల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. 100కు 97 మార్కులు సాధించి ముందంజలో నిలిచాడు. కిర్ల ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదివిన అకాష్‌రెడ్డి అంబేడ్కర్‌ గురుకుల ప్రవేశ పరీక్షలోనూ రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. ఏపీ మోడల్‌ స్కూల్‌ పరీక్షల్లోనూ కొత్తవలస మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆకాష్‌రెడ్డిని గ్రామపెద్దలు, తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement