● అధునిక టెక్నాలజీ కోర్సులతో విద్యార్ధులకు కొత్త అవకాశాలు
విజయనగరం గంటస్తంభం: సీతం కాలేజీలో ఐదు రెగ్యులర్ డిప్లమో కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ డా.మజ్జి శశిభూషణ రావు తెలపారు. డిప్లమో ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తక్కువ వయసులోనే నైపుణ్యాలు సంపాదించి మంచి ఉద్యోగాలు పొందేందుకు పాలిటెక్నిక్ విద్య ప్రయోగశాలలు, గ్రంఽథాలయం వంటి మౌలిక సదుపాయాలతో కళాశాల సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్ జి.టి.నాయుడు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే కళాశాలలో ఏర్పాటు చేసిన క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, మిషిన్‌లెర్నింగ్ రంగాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయని డీన్‌ఆర్‌డీ డా.వీజీ.ప్రసన్న తెలిపారు. ఇప్పటివరకు 17 పరిశోధన ప్రాజెక్టులకు దరఖాస్తు చేయగా, వాటిలో ఎక్కువ క్వాంటం టెక్నాలజీకి సంబంధించినవని చెప్పారు. స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, వాతావరణ సూచనలపై ఆధునిక పరిశోధనలు కొనసాగుతున్నాయని వెల్ల డించారు.


