● రూ.6.75 లక్షల ఆర్థిక సాయం అందజేత
విజయనగరం క్రైమ్: ప్రార్థించే పెదవులు కన్నా... సాయం చేసే చేతులు మిన్న అన్న పెద్దల మాటను జిల్లా పోలీశాఖ సిబ్బంది గురువారం అక్షరాలా పాటించారు. గంట్యాడ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆదిమడపల శ్రీనివాసరావు గతనెల 28న బొబ్బిలిలో జరిగే పండగ బందోబస్తుకు వెళ్తుండగా గజపతినగరం వద్ద కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెచ్‌సీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆరోగ్య భద్రత అధికారులతో ఎస్పీ మాట్లాడి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. మెరుగైన చికిత్సకు అదనంగా డబ్బులు అవసరంకావడంతో ‘చేయూత‘ పథకం కింద సిబ్బంది అంతా కలిసి ఇచ్చిన రూ.6.75 లక్షలను శ్రీనివాసరావు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె గౌతమిలకు ఎస్పీ దామోదర్ గురువారం తన కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, విద్యాసాగర్, వన్‌టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, రిజర్వు ఇన్‌స్పెక్టర్ ఎన్.గోపాలనాయుడు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


