విజయనగరం: విజయనగరం జిల్లా స్థాయి అండర్–13 చెస్ పోటీల్లో చిన్నారులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజయనగరం చెస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శ్రీమన్, నారాయణ సాహూ, అమండు, జిగ్నేష్, బాలికల విభాగంలో ఎజ్జురోతు పరిణిత, భావన రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపిక ప్రక్రియకు కె.వి.జ్వాలాముఖి, ఎ.హేమబిందు, ఆసిఫ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ జిల్లా క్రీడాకారులు రాణించి విజయనగరం పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.
● అండర్–13 విభాగంలో ప్రతిభ చాటిన క్రీడాకారులు
● ఓపెన్ విభాగంలో నలుగురు, బాలికల విభాగంలో ఇద్దరు అర్హత


