ఈ ఏడాది అధిక శాతం మంది ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించే అవకాశం జిల్లా నుంచి లభించనుంది. 15 మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు రాబెట్టారు. ఈ క్రమంలో వారు ట్రిపుల్ ఐటీలో చేరే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మా పరిధిలో ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని గ్రామాల్లో ప్రచారం చేయటంతో పాటు అర్హత గల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీకి దరఖాస్తులు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.
– పర్రి కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఓ, పాలకొండ


