భామిని: మండలకేంద్రంలోని శ్రీ షిరిడీసాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణం డీలర్‌పై కేసు నమోదు చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించినట్లు భామిని వ్యవసాయాధికారి కొల్లి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. బత్తిలిలోని ఎరువుల డిపోపై పాలకొండ ఇన్‌చార్జ్ ఏడీఏ ఎన్ని వాహిని ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేసినట్లు వివరించా రు.బత్తిలి డీలర్‌కు ఈ నెల–12న 50 టన్నుల ఎరువులు వచ్చాయని వాటి పంపిణీలో ఎటువంటి రికార్డులు లేకుండా అమ్మకాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలతో దర్యాప్తు చేసినట్లు తెలియజేశారు. ఏభై టన్నుల 20–20–0–13 అనే కాంప్లెక్స్ ఎరువులను ఆన్‌లైన్‌లో సేల్ చేయకుండా, రైతుకు బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేసినట్లు చెబుతున్న కారణంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు, ఎరువుల దుకాణంతో పాటు, గొదాంలు కూడా తనిఖీ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో రెవెన్యూ అధికారి నిమ్మల మహేష్, వ్యవసాయ సహాయకుడు ఆరిక నిఖిల్, స్థానిక రైతులు ఉన్నారని తెలిపారు.


