విజయనగరం ఫోర్ట్: అందరికీ అన్నం పెట్టే అన్నదాతలతో టీడీపీ సర్కార్ ఆటలాడుతోంది. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పాటు పడతామని గొప్పలు చెప్పిన టీడీపీ సర్కార్ ఆ తర్వాత రైతులను గాలికి వదిలేసింది. గడిచిన రెండేళ్లుగా ఎటువంటి యంత్ర పరికరాలు టీడీపీ ప్రభుత్వం అందించలేదు. తాజాగా మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం ద్వారా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్ర పరికరాలు అందిస్తామని టీడీపీ సర్కార్ ప్రకటించింది. అయితే గతంలో మాదిరి కాకుండా లాటరీ ద్వారా యంత్ర పరికరాలు కేటాయిస్తామని మెలిక పెట్టింది. లాటరీ పద్ధతిపై యంత్ర పరికరాలు కేటాయించడం అంటే రైతులను ఇబ్బంది పెట్టడమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లాటరీ వరించినా కష్టమే
లాటరీలో యంత్ర పరికరం వచ్చినప్పటికీ అది అన్నదాతకు అందుతుందనే గ్యారంటీ లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత చందాన లాటరీలో వరించినప్పటికీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమోదంతోనే యంత్ర పరికరాలను రైతులకు అందజేస్తారు. లాటరీ వరించిన రైతు అధికార పార్టీకి చెందిన వారు కాకపోతో పక్కన పెట్టేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ యంత్ర పరికరాల కోసం లాటరీ
టీడీపీ సర్కార్ వింత ధోరణి
రైతులు ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన
లాటరీ వరించినా ఇన్‌చార్జి మంత్రి అమోదం తప్పనిసరి
జిల్లాకు యంత్ర పరికరాల కోసం రూ.4.22 కోట్లు కేటాయింపు


