గజపతినగరం మండలంలో పొలాల్లోనే ఉన్న మొక్కజొన్న బస్తాలు
అనుమతులు రాలేదు..
మొక్కజొన్న పంట కొనుగోలుకు వీలుగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఎటువంటి అనుమతులు రాలేదు. రబీలో వరి పంట తక్కువ విస్తీర్ణంలో సాగైనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
– ఎన్. వెంకటేష్, మార్కెఫెడ్‌జిల్లా మేనేజర్
– వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి
విజయనగరం ఫోర్ట్:
రైతు సంక్షేమమే లక్ష్యమంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రకటనలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలను కొనుగోలుచేసే వారే కరువయ్యారు. పంట చేతికొచ్చి నూర్పిడిలు సాగుతున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కానరావడం లేదు. రైతులకు మద్దతుధర లభించడం లేదు. వరి, మొక్కజొన్న పంటలను అతి తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంట దళారుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవీ?
జిల్లాలో రబీలో 4,642 హెక్టార్లలో వరి, 45,590 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. వరి పంట 23,290 మెట్రిక్ టన్నుల వరకు, మొక్కజొన్న 3,28,248 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చింది. పంటలను కొనుగోలుచేసేందుకు అనువుగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. అధికారులు ప్రతిపాదనలను కనీసం పట్టించుకోవడంలేదు. రైతులు గగ్గోలు పెడుతున్నా కనికరించని పరిస్థితి. గత్యంతరంలేని పరిస్థితుల్లో తక్కువ ధరకే పంటను విక్రయించేస్తున్నారు. ఇప్పటకే చాలా వరకు పంటను దళారులకు విక్రయించేశారు.
మెంటాడ మండలంలో ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రోడ్డుపైనే నిల్వ చేసిన ధాన్యం బస్తాలు
కొనుగోలు కేంద్రాలు లేక
దళారులు కొనుగోలుచేస్తున్న ధర
రూ.800-700
రూ.2,400
నష్టపోతున్న రైతులు
వరి పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.2,369 కాగా దళారులు రూ.1900కు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు క్వింటాకు రూ.469 నష్టపోతున్నారు. మొక్కజొన్న పంట క్వింటాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400. కానీ దళారులు కొనుగోలు చేస్తున్నది రూ.1600 నుంచి రూ.1700కు మాత్రమే. దీనివల్ల రైతులు రూ.800 నుంచి రూ.700వరకు నష్టపోతున్నారు.
రూ. 1600-1700
మధ్యన


