ప్రభుత్వబడి పిల్లలకు విమాన ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వబడి పిల్లలకు విమాన ప్రయాణం

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

మాట నెలబెట్టుకున్న తెలుగు మాస్టారు సత్యారావు

విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని, పోటీతత్వాన్ని పెంచేందుకు గోపన్నవలస జెడ్పీ హైస్కూల్‌ తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు వినూత్న కార్యక్రమం చేపట్టారు. తాను ఇచ్చిన మాట ప్రకారం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదివారం విశాఖ నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లారు. విమాన ప్రయాణం చేసిన వారిలో మంత్రి విజయలక్ష్మి, నామాల లిఖిత, సంచాన దినేష్‌, ఇప్పిలి శేఖర్‌, మంత్రి ప్రియవర్షిని, గండ్రేటి కార్తీక్‌ ఉన్నారు. విజయవాడలో పలు దర్మనీయ ప్రదేశాలను సందర్మించిన అనంతరం వీరు సోమవారం విజయనగరం చేరుకున్నారు. కలెక్టర్‌ రాంప్రసాద్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఏడాది కూడా విద్యార్థుల తల్లిదండ్రులను విమానం ఎక్కించి విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించారు.

Advertisement
 
Advertisement
Advertisement