చీపురుపల్లిరూరల్(గరివిడి): పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాపై వైఎస్సార్‌సీపీ బూత్ ఏజెంట్లు, నాయకులు దృష్టిసారించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దిశానిర్ధేశం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బొత్స అనూష, బొత్స సందీప్‌తో కలిసి గరివిడిలోని పార్టీ కార్యాలయంలో మెరకముడిదాం మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ క్లస్టర్,డివిజన్ ఇన్‌చార్జ్‌లు,బూత్ ఏజెంట్లతో శనివారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు,పేర్ల మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై బూత్‌స్థాయి నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ ఓటరుతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకుని పార్టీకి మరింత బలం చేకూరేలా పని చేయాలని అన్నారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, నాయకులంతా సమన్వయంతో పని చేసి పార్టీని బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు,మాజీ జెడ్పీటీసీ కోట్ల వెంకటరావు, నాయకులు తాడ్డి వేణు,బూర్లె నరేష్‌కుమార్,హరిబాబు, రాము, ఎంపీటీసీలు,మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.


