నెల్లిమర్ల రూరల్: పేదరికం వారి అడుగులు ఆపలేదు. కూలి పనులు చేసే తల్లిదండ్రుల కష్టాలు వారి కలలను చిన్నవి చేయలేదు. తండ్రి సంగిడీరాళ్ల పోటీల్లో రాణించాలన్న కల పేదరికం కారణంగా నెరవేరలేదు. కుమార్తెల రూపంలోనైనా తన కలను నెరవేర్చుకునేందుకు సంకల్పించాడు. వచ్చిన కూలిడబ్బులతో కుమార్తెలకు వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇప్పించాడు. అది ఫలించింది. ఇద్దరు కుమార్తెలు ప్రపంచ వేదికలపై పతకాల పంట పండిస్తున్నారు. దేశం పేరును ఇనుమడింపజేస్తున్నారు. వారే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన బెల్లాన శ్రీను, గౌరి కుమార్తెలు హారిక, భార్గవి. ఇటీవల సమోవాలో జరిగిన కామన్వెల్త్ యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2026లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి పేరుతెచ్చారు.
● తండ్రి కలను సాకారంచేస్తూ...
హారిక, భార్గవిల తండ్రి బెల్లాన శ్రీనుకు చిన్నప్పటి నుంచి గ్రామీణ క్రీడలంటే అపారమైన అభిమానం. ఉత్తరాంధ్రలో గ్రామీణ క్రీడగా పేరొందిన సంగిడీ రాళ్ల పోటీల్లో ఆయన చిన్నతనం నుంచే పాల్గొని ప్రతిభ కనబరిచేవాడు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తన కలను కొనసాగించలేక వ్యవసాయ కూలీగా మారాల్సి వచ్చింది. తనకు నెరవేరని కలను కుమార్తెల ద్వారా నిజం చేసుకోవాలని శ్రీను నిర్ణయించుకున్నారు. శ్రీను, ఆయన భార్య గౌరి కూలిపనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను వెయిలిఫ్టింగ్‌లో ప్రోత్సహించారు. అంతర్జాతీయ వేదికలపై రాణించేందుకు తమవంతు తోడ్పాటునందించారు.
● ఎనిమిదేళ్ల వయసు నుంచే శిక్షణ...
తన కుమార్తెల ప్రతిభను చిన్న నాటి నుంచే గుర్తించిన శ్రీను వారిని ఎనిమిదేళ్ల వయస్సులోనే శిక్షణకు పంపించారు. కామన్‌వెల్త్ గేమ్స్ విజేత, ఇండియన్ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు వారికి మేనమామే కావడంతో వాళ్ల విజయానికి సూచనలు, సహకారం అందింది. శ్రీనివాసరావు వద్ద ఇద్దరూ కఠిన సాధన ప్రారంభించారు. పల్లెటూరి వాతావరణంలో ప్రారంభమైన వారి ప్రయాణం క్రమంగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరింది. క్రమశిక్షణ, పట్టుదల, కఠోర శ్రమతో అక్కా చెల్లెళ్లు వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
● ప్రభుత్వం ఊతమిస్తే మరిన్ని విజయాలు..
పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలంటే మంచి శిక్షణ, పౌస్టికాహారం, ఆధునిక సదుపాయాలు అవసరం. మా స్థోమత మేరకు కష్టపడుతున్నాం. ప్రభుత్వం సహాయం చేస్తే వారు ఇంకా గొప్ప విజయాలు సాధిస్తారని తండ్రి శ్రీను ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఇద్దరు కుమార్తెలు సాధించిన విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
ఒలింపిక్స్‌లో రాణించడమే లక్ష్యంగా...
అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు మరిన్ని పతకాలు అందించడమే తమ లక్ష్యమని హారిక, భార్గవి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించి పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎంత కష్టమైనా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. తండ్రి శ్రీను కష్టం, తన మేనమామ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు మార్గదర్శకత్వమే తమ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
నమ్మకానికి తూట్లు..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రారంభం నుంచీ వైఫల్యాల పుట్టగానే మారింది. 720 మార్కులకు గాను దాదాపు 600 మార్కుల విలువైన ప్రశ్నలు ముందే లీకేజీ కావడం దారుణం. కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల దోపిడీకి మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. వెంటనే ఎన్‌టీఏను రద్దు చేసి, పరీక్షల బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలి. – డి.రాము,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్మి, విజయనగరం
మంత్రి రాజీనామా చేయాల్సిందే..
దేశవ్యప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి రాసిన పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నైతిక ఓటమి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి.
– ఎన్.నాగభూషణం, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి
మా కష్టానికి విలువేది..?
నేను డాక్టర్ అవ్వాలని రెండేళ్లుగా నిద్రలేని రాత్రులు గడిపి నీట్‌కు చదివాను. తీరా పరీక్ష రాశాక, పేపర్ లీక్ అయిందని తెలియగానే నా ప్రపంచం కూలిపోయినట్లు అనిపించింది. మేం పడిన కష్టానికి, మా తల్లిదండ్రుల త్యాగానికి విలువే లేదా? – కె.యామిని, విద్యార్థిని,
విజయనగరం
బతుకులను వేలం వేస్తారా?
రెక్కాడితే గాని డిక్కాడని మా బతుకుల్లో బిడ్డను డాక్టరుగా చూడాలనేది ఒక పెద్ద కల. మా కడుపు మాడ్చుకుని పిల్లలను చదివిస్తున్నాం. మోదీ ప్రభుత్వం మా పిల్లల జీవితాలను వేలం వేసి అమ్ముకుంటోంది. పిల్లల మానసిక ఆందోళనకు బాధ్యులెవరు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి.
– కోరాడ వేణుబాబు, చెల్లూరు
బాగా రాశాను... బాధగా ఉంది
పరీక్ష బాగా రాశాను. చాలా సంతృప్తినిచ్చింది. కీ చూసుకున్న తర్వాత 600 వరకు మార్పులు వస్తాయని భావించాను. నా ప్రిపరేషన్‌కి తగ్గ ఫలితం లభించింది అనుకున్నాను. ఇంతలో పిడుగులాంటి నీట్ రద్దు వార్త విన్నాను. చాలా బాధేస్తోంది. మళ్లీ అదే స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించగలమా అనే సందేహం కలుగుతోంది.
–మంత్రి నిహారిక నాయుడు,
న్యూ కాలనీ, పురిటిపెంట
ఆ ఉత్సాహం వస్తుందా..
నీట్‌లో 570 మార్కులు స్కోర్ చేశాను. మొదటిసారి ఉన్నంత ఉత్సాహం రెండో సారి ఉంటుందా అన్న సందేహం నెలకొంది. ప్రశ్నపత్రాన్ని అమ్మేయడం దారుణం. బాధగా ఉంది.
– లెంక పుష్పహాసిని,
విద్యార్థి, దిగువ వీధి, గజపతినగరం
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు...
హారిక ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2023లో ఒక స్వర్ణం, కాంస్యం గెలుచుకుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, అస్మిత ఖేలో ఇండియా పోటీల్లోనూ ప్రతిభ చాటింది. భార్గవి కూడా కామన్వెల్త్ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2024లో స్వర్ణ పతకం సాధించింది. ఐడబ్ల్యూఎల్‌ఎఫ్ నేషనల్ యూత్ పోటీల్లోనూ రజత పతకాలు గెలుచుకుని తన ప్రతిభను నిరూపించింది. పలు రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం పదుల సంఖ్యలో పతకాలు సాధించారు.
ఇటీవల దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న సమోవాలో జరిగిన పోటీల్లో అక్కాచెల్లెళ్లు హారిక, భార్గవి సత్తాచాటారు. 19 ఏళ్ల హారిక జూనియర్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కిలోలు మొత్తంగా 197 కేజీల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుంది. అదే వేదికపై 17 ఏళ్ల భార్గవి యూత్ విభాగంలో స్నాచ్‌లో 74 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 102 కిలోలు... మొత్తంగా 180 కిలోల బరువును ఎత్తి స్వర్ణపతకంతో పాటు వెండి పతకాన్ని దక్కించుకుంది.


