రైతులు అందరికీ రైతు కార్డులు ఇస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈనెల 15న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. రైతులు ఆర్‌ఎస్‌కేలకు వెళ్లి వి వరాలు నమోదుచేయాలి. రైతు కార్డు ఉంటేనే ఎరువులు అందుతాయి. అవి కూడా అందులో నమోదు చేసే పంటల ఆధారంగా ఇస్తాం.
కె.చంద్రరావు, వ్యవసాయశాఖ ఏడీఏ, రాజాం
రైతులందరికీ ఎరువులు అందిస్తాం
రానున్న ఖరీఫ్ సీజన్‌లో పంటలు వేసిన రైతులందరికీ ఎరువులు అందిస్తాం. ఎరువులు అనధికారుల చేతిలోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎరువులు కార్డులు ఉన్న వారిందరికీ అవసరం అయిన ఎరువులు అందిస్తాం.
ఎ.తిరుపతిరావు, ఏఓ, గుర్ల


