సరికొత్తగా నగర స్వరూపం | - | Sakshi
Sakshi News home page

సరికొత్తగా నగర స్వరూపం

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

సరికొత్తగా నగర స్వరూపం కసరత్తు పూర్తి చేశాం.. విభజన కొలిక్కి.. మారనున్న నగర స్వరూపం ఆశావహుల్లో నూతన ఉత్సాహం

కార్పొరేషన్‌ పరిధిలో పెరగనున్న డివిజన్‌ల సంఖ్య 50 డివిజన్‌ల నుంచి 62 డివిజన్‌లకు పెంపు 2011 జనాభాకు 10 శాతం అదనపు జనాభా ప్రతిపాదికన విభజన ఒక్కో డివిజన్‌లో 4000 మంది జనాభా ఉండేలా నూతన డివిజన్‌లు నేడు డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ చేయనున్న కార్పొరేషన్‌ అధికారులు అభ్యంతరాలు స్వీకరణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక

ఇదీ ప్రస్థానం

విజయనరగం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో డివిజన్‌ల సంఖ్యను పెంచాలని మున్సిపల్‌ శాఖ జీఓ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 62కు పెంచేందుకు కసరత్తు పూర్తి చేశాం. ఇప్పటికే దీనిపై ఒక అవగాహన కలిగి ఉన్నాం. తయారు చేసిన జాబితాను ప్రచురించి న అనంతరం అభ్యంతరాలు స్వీకరించి ఉన్న తాధికారులకు పంపిస్తాం. అనంతరం కలెక్టర్‌ అనుమతితో కమిషనర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ మున్సిపల్‌ అథారిటీకి పంపిస్తాం.

– హరిబాబు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌,

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముఖచిత్రం

విజయనగరం:

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి లో డివిజన్‌ల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. 2011 జనాభా లెక్కలను అనుసరించి మా ర్పులు చేస్తుండగా.. అన్నింటా ఒకే విధంగా జనాభా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రణాళికా విభాగం నుంచి వివరాలు తీసుకుని.. హద్దులు నిర్ణయించే ప్రక్రియను పూర్తిచేశారు. సోమవారం డ్రాఫ్ట్‌ ప్రతిపాదిత డివిజన్ల పునర్విభజ న జాబితాను ప్రచురించనుండగా... ఆ తర్వాత వారం రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 10 రోజుల్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఆపై వాటిని ఖరారు చేసి.. రిజర్వేషన్లపై దృష్టి సారించనున్నారు.

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డివిజన్‌ల విభజన ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వ చ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తు తం ఉన్న 50 డివిజన్‌లను 62 డివిజన్‌లుగా విభజించారు. ఒక్కో డివిజన్‌లో గరిష్టంగా 4000మంది జనాభా ఉండేలా సరిహద్దులు నిర్ణయించారు. ఆయా ప్రతిపాదనలను సోమవారం ప్రచురించనున్నారు. డ్రాఫ్ట్‌లో ప్రతి కాలనీ పేరు, ప్రాంత పేరు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారో.. లేదో.. చూడా ల్సి ఉంది. ఈ ప్రక్రియలో రాజకీయ పక్షాలు,ప్రజ ల నుంచి అభ్యంతరాలు వస్తే మరల సరిచేయాల్సి వస్తోంది.

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వరూపం మారనుంది. ఇప్పటి వరకు 50 డివిజన్లు ఉండగా, ఇప్పుడు కొత్తగా మరో 12 డివిజన్లు పెరిగాయి. దీంతో మొత్తం డివిజన్‌ల సంఖ్య 62కు చేరనుంది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఈ ప్రక్రియకు సంబంధించిన జీఓను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని దానికి 10 శాతం జనాభాను కలిపి డిజిజన్‌ల సంఖ్యను పెంచినట్లు జీఓలో పేర్కొంది. దీని ప్రకారం విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో జనాభా 2011లో 2,44,598 మంది ఉన్నారు. దీనికి పది శాతం కలిపితే 2.69లక్షలకు పైగా జనాభా అవుతుంది. వాస్తవానికి అంతకు మించి జనాభా ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లెక్కలు వేయటం గమనార్హం. ఈ లెక్కన నగరంలో డివిజన్లు 50 నుంచి 62కు పెరగనున్నాయి.

నగరం, పట్టణాల్లో వార్డుల సంఖ్య గణనీయంగా పెరగనుండటంతో ఆశావహుల్లో ఆనందం నెలకొంది. గత ఎన్నికల్లో చాలా మంది టికెట్లు ఆశించి భంగప డ్డారు. అప్పట్లో వార్డుల సంఖ్య తక్కువగా ఉండటం, పోటీపడేవారు ఎక్కువ మంది ఉండటంతో చాలా మంది చివరి నిమిషంలో అవకాశాలు కోల్పోయారు. రానున్న ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే డివిజన్‌ల పెంపు ఎవరికి కలిసి వస్తుందో... ఎవరికి కొంప ముంచుతుందో వేచి చూడాల్సి ఉంది.

విజయనగరం మున్సిపల్‌ ప్రస్థానం 1888లో మొదలైంది. అప్పట్లో నలుగురు సభ్యులతో మున్సిపల్‌ అసోసియేషన్‌ ఏర్పడింది. ఆ తరువాత వివిధ పార్టీల ఆధారంగా 1974లో తొలి మున్సిపల్‌ ఎన్నికలు 27 వార్డులకు జరిగాయి. 1971వరకు సోషల్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీగా ఉండేది. 1998లో సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీగా పార్టీగా మారింది. 40 వార్డులుగా విభజించారు. 2019లో నగరపాలక సంస్థగా మారింది. 50 డివిజన్లను చేసి 2020లో ఎన్నికలను నిర్వహించారు. తాజాగా 62 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీఓ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement