మ్యూజిక్ సిట్టింగ్స్ లో ‘ఎంగేజ్మెంట్’ | Music Sittings Begin For Raaju Bonagaani Engagment | Sakshi
Sakshi News home page

మ్యూజిక్ సిట్టింగ్స్ లో ‘ఎంగేజ్మెంట్’

Oct 22 2022 4:04 PM | Updated on Oct 22 2022 4:04 PM

Music Sittings Begin For Raaju Bonagaani Engagment - Sakshi

‘రాజు బొనగాని’ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘ఎంగేజ్మెంట్’. బొనగాని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో హీరోయిన్లుగా కొత్తవాళ్లను పరిచయం చేస్తూ... తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్టు పనులు ముగించుకుని... ప్రి ప్రొడక్షన్ వర్క్స్ తోపాటు... దిలీప్ బండారి సంగీత సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది.

డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి మన్నం వెంకట్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.   దర్శకనిర్మాత రాజు బొనగాని మాట్లాడుతూ... "పెళ్లి చూపులతో మొదలై... "ఎంగేజ్మెంట్"తో శుభం కార్డు పడే ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ "ఎంగేజ్మెంట్". యూనివర్సల్ అప్పీల్ కలిగిన సబ్జెక్ట్ కాబట్టి... తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement