తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్నవారిలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన చోటు కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


