సీఎం రేవంత్ రెడ్డికి జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి | Jajula Srinivas Goud Appeals to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్ రెడ్డికి జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి

Sep 10 2026 10:00 PM | Updated on Sep 10 2026 10:00 PM

Jajula Srinivas Goud Appeals to CM Revanth Reddy

హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కాలం చేర్చకుండా అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్ర తరహా లోనే ఓబీసీ కాలం చేర్చి, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు

నేడు రాష్ట్ర అసెంబ్లీలో  వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, సంచార జాతుల సంఘం రాష్ట్ర నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాసులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో జాజుల శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందజేశారు

బీసీ కులాల లెక్కలు సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని, కేంద్ర ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా జాజుల కోరారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో ఉన్న 51 కులాలను సంచార జాతులుగా డీఎన్టీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 10 నీ విడుదల చేసిందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

రాష్ట్రంలోని 30 లక్షల మంది సంచార జాతులకు విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా జరిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఇదే సమయంలో ఈ నెలాఖరులో హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే సంచార జాతుల విముక్తి దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. సీఎంతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, సంచార జాతుల సంఘాల నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాస్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఉన్నారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement