Video: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం | Rtc Bus Rams Into Petrol Bunk At Batasingaram | Sakshi
Sakshi News home page

Video: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Sep 10 2026 3:30 PM | Updated on Sep 10 2026 4:30 PM

Rtc Bus Rams Into Petrol Bunk At Batasingaram

సాక్షి, రంగారెడ్డి జిల్లా: బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఆటోను తప్పించబోయి.. పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్‌ డిపో బస్సు.. చౌటుప్పల్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. బంక్‌లోని డీజిల్‌ పంపు వరుకు దూసుకెళ్లడంతో పరికరాలు కూడా విరిగిపడ్డాయి. బంక్‌ సిబ్బంది, అక్కడ ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.

కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేటును ఆటో ఢీకొట్టింది. దేవగిరి ఎక్స్‌ప్రెస్ కోసం గేటు వేస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే గేట్  ధ్వంసం కావడంతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

​సూర్యాపేట జిల్లాలో..
​సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ​రోడ్డు పక్కన భోజనం కోసం ఆపిన రెండు లారీలను మరో లారీ  బలంగా ఢీకొట్టింది. ​డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి విజయనగరం వెళ్తుండగా ఘటన జరిగింది. ​లారీ బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారి-65 పై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది.

పెట్రోల్ బంక్ లోకి దూసుకొచ్చిన బస్సు కార్లు తుక్కు తుక్కు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement