హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చేందుకు పవర్ లేదని, ప్రతి పక్షాల పీక నొక్కేందుకు మాత్రం కాంగ్రెస్‌కు పవర్ ఉందా? అని నిలదీశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు. రాష్ట్ర రైతులకు కనీసం ఇప్పుడు 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా రావడం లేదని హరీష్‌రావు విమర్శించారు. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 10వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో తెలంగాణ రైతాంగ కష్టాలు చూడాల్సి వస్తుందన్నారు.
‘ఒకవైపు నీళ్లు ఇవ్వలేవు.. కరెంట్ ఇవ్వలేవు.. ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు. అసలు రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని సూటిగా నిలదీశారు. భద్రాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ ఎందుకు బంద్ చేశావ్ రేవంత్ అని ప్రశ్నించారు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడపలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ పరిపాలనా వైఫల్యమని హరీష్ మండిపడ్డారు.
ఇదీ చదవండి:
ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి


