‘లోకేష్‌కు మంత్రిగా కొనసాగే హక్కు లేదు’ | Former Minister Ambati Rambabu Slams Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌కు మంత్రిగా కొనసాగే హక్కు లేదు’

Sep 10 2026 3:43 PM | Updated on Sep 10 2026 5:25 PM

Former Minister Ambati Rambabu Slams Nara Lokesh

గుంటూరు: డీఎస్సీ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన లోకేష్‌కు మంత్రిగా కొనసాగే హక్కు లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అం‍బటి రాంబాబు విమర్శించారు.  డీఎస్సీ పరీక్షల్లో ఎన్నడూ జరగనంత అవినీతి జరిగిందని, లోకేష్‌ అడ్డంగా దొరికిపోయాడని మండిపడ్డారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సీబీఐ వ విచారణ జరిపించాలని అంబటి డిమాండ్‌ చేశారు.

‘డీఎస్సీ పై ప్రభుత్వానికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. అందుకే చంద్రబాబు గానీ, లోకేష్ గానీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మాట్లాడలేదు. లోకేష్... లవ్ క్యాష్ అన్న సంగతి తెలుసు. లోకేష్ దొరికిపోయిన దొంగ. లోకేష్ రాజకీయాలకు పనికి రారు...మంత్రిగా కూడా పనికి రారు. లోకేష్‌ను ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారట ముఖ్యమంత్రిని చేస్తే దేశాన్నే అమ్మేస్తారు. 

లోకేష్ ఉద్యోగాలను బఠానీలు అమ్మినట్లు అమ్మేశారు. ఆయన రాజీనామా చేయాలి. లోకేష్‌తోనే టీడీపీ సర్వ నాశనం అవుతుంది. డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్‌ల చేత మాట్లాడిస్తున్నారు. ఇంకా రెండు డిఎస్సీలు పెడతామంటున్నారు.  లోకేష్‌కు మంత్రి సీటులో కూర్చునే హక్కు లేదు’ అని ధ్వజమెత్తారు.

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

ఇదీ చదవండి:
చంద్రబాబుది టెన్షనా.. ఫ్రస్టేషనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement