సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: దొంగ పెన్షన్ల కోసం టీడీపీ పన్నాగం బట్టబయలైంది. గ్రామ సచివాలయాలను కూడా టీడీపీ కార్యకర్తలు కబ్జా చేసేస్తున్నారు. పెన్షన్ల దరఖాస్తులు టీడీపీ కార్యకర్తలు నేరుగా అప్లోడ్ చేసుకుంటున్నారు. కురుపాం-2 సచివాలయంలో ఈ ఘటన వెలుగు చూసింది. డిజిటల్ అసిస్టెంట్ సీటులో టీడీపీ కార్యకర్త ప్రత్యక్షమయ్యాడు.
టీడీపీ కార్యకర్తల దరఖాస్తులు అప్లోడ్ చేసుకున్న సుఖేశ్ చంద్ర పండ.. సచివాలయ సిబ్బందిని పక్కకి పంపేసి నచ్చిన పేర్లు రాసేసుకున్నాడు. ఎన్నికల నేపథ్యంలో కొత్త పెన్షన్‌లకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరిస్తుండగా.. టీడీపీ నేతలు చెప్పిన వాళ్ల దరఖాస్తులు మాత్రమే ప్రభుత్వం స్వీకరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.
ఇదీ చదవండి: కాక్రోచ్‌లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్


