‘నమ్మినవాళ్లే మోసం చేశారు..’ ఏడ్చేసిన బొత్స | YSRCP Botsa Breaks Down Over Nephew Exit Betrayal | Sakshi
Sakshi News home page

‘నమ్మినవాళ్లే మోసం చేశారు..’ ఏడ్చేసిన బొత్స

Sep 10 2026 1:20 PM | Updated on Sep 10 2026 3:23 PM

YSRCP Botsa Breaks Down Over Nephew Exit Betrayal

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి పరిణామాలతో కలత చెందిన ఆయన.. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను అంటూ కంటతడి పెట్టారు. అయితే తండ్రి బొత్స సత్యనారాయణ కంటితడి పెట్టడంపై ఆయన కుమార్తె బొత్స అనూష చలించిపోయారు. తండ్రిని ఓదార్చారు. 

గురువారం గరివిడిలో చీపురుపల్లిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమయంలో బొత్స  మేనల్లుడు మజ్జి శ్రీనివాస్‌(చిన్న శ్రీను) ఇటీవలె పార్టీ మారడం.. పార్టీతో కలిసి నడిచిన రోజుల్ని, అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ ప్రసంగాల సమయంలో.. నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు.  

ఆపై తనను తాను సముదాయించుకుని.. ‘‘వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేయాలి. వైఎస్‌ జగన్‌ ఆశయాల కోసం కలిసి పని చేద్దాం. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను’’ అని అన్నారాయన.

నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు..! కన్నీరు పెట్టిన బొత్స

ఇదీ చదవండి: నేనూ ఓ కాక్రోచ్‌గా మారొచ్చు: వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement