జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్‌ జగన్‌ | Jagan Slams Lokesh Over DSC Scam Questions BJP Jana Sena Silence | Sakshi
Sakshi News home page

జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్‌ జగన్‌

Sep 10 2026 1:01 PM | Updated on Sep 10 2026 1:29 PM

Jagan Slams Lokesh Over DSC Scam Questions BJP Jana Sena Silence

సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్‌ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆయన.. స్కామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.

డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్‌ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్‌ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు.  జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం..

..ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్‌ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్‌ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారు

చంద్రబాబు, లోకేశ్‌లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు.  ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్‌ జగన్‌ స్పందించారు. లోకేశ్‌, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. 

డీఎస్సీ స్కామ్‌పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. జగన్‌ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్‌ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement